చంద్రముఖి గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఓ ట్రెండ్ సెట్ చేసిన చంద్రముఖి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఈ మంచి విజయాన్ని అందుకుంది.హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ లో జోతిక చంద్రముఖి పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు చంద్రముఖి కు సీక్వెల్ రాబోతుంది. ఈ లో హీరోగా లారెన్స్ నటిస్తున్నారు. అలాగే హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తుంది. చంద్రముఖి2 బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ ను నిర్మిస్తున్నారు. అలాగే సీనియర్ డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించారు. గతంలో వచ్చిన చంద్రముఖి కు కూడా పి. వాసునే దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 28న ఈ చంద్రముఖి 2 విడుదలవుతుంది. ఇక ఈ ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ ఈవెంట్‌ను యువి మీడియా నిర్వహించారు.

ఈ ఈవెంట్‌లో.. హీరో రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. 'రెబల్ తరువాత నాకు డైరెక్షన్ చేసే టైం కుదరలేదు అన్నారు. ఇప్పుడు ఇలా చంద్రముఖి 2 తో మీ ముందుకు వస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు ఏమీ ఆశించకుండా ప్రేమిస్తుంటారు. నేను ఎప్పుడూ దేవుడ్ని చూడలేదు. ఈ ప్రేమ పేరే దేవుడని అనుకుంటున్నాను అని అన్నారు లారెన్స్. నేను డ్యాన్స్ మాస్టర్ గా చేస్తున్న సమయంలో ప్రతీ హీరో అభిమాని నాకు కూడా ఫ్యాన్ అయ్యారు. నాకు ఛాన్స్ ఇచ్చిన హీరోలందరికీ థాంక్స్. ఈ విషయానికి వస్తే నేను ముందుగా సూపర్ స్టార్ రజినీకాంత్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన నటించిన చిత్రంలో నేను నటించాను. వాసు గారు కథ చెప్పారు.. నేను చేయొచ్చా? అని అడిగాను. ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. నా లైఫ్‌లో నేను ముగ్గురినీ ఎప్పుడూ మరిచిపోను. రజినీ కాంత్ గారు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడ్ని కాదు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే మీ అందరి అభిమానం నాకు దక్కేది కాదు. డైరెక్షన్ ఛాన్స్‌ను నాగార్జున గారు ఇచ్చారు. కీరవాణి గారికి మ్యూజిక్ తప్పితే ఇంకేం తెలియదు. అదే లోకంలో ఉంటారు. ఆయన సంగీత సారధ్యంతో మేం పని చేయడం ఆనందంగా ఉంది. నేను గ్రూప్ డ్యాన్సర్‌గా పని చేస్తున్నప్పటి నుంచీ పి. వాసు గారు ఇంకా దర్శకత్వం వహిస్తూనే ఉన్నారు. ఈ వయసులోనూ ఆయన చాలానే కష్టపడుతుంటారు. నా బాడీలోంచి రజినీ గారిని తీసేయడం వాసు గారికి పెద్ద టాస్క్ అయింది. ఎలా చేయాలా? అని అన్నయ్య రజినీకి ఫోన్ చేసి అడిగాను. ఆయన ఇచ్చిన సలహాతోనే కాస్త భయపడుతూ పని చేశాను. మీ అందరికీ నచ్చతుందని ఆశిస్తున్నాను. నిర్మాత సుభాస్కరణ్ గారు దివ్యాంగుల కోసం కోటి రూపాయల విరాళం ఇచ్చారు. నేను కూడా నా వంతు సాయం చేస్తున్నాను. ఇదంతా నా డబ్బు కాదు. ప్రేక్షకుల డబ్బులే. ప్రేక్షకుల నుంచే డిస్ట్రిబ్యూటర్లు, అక్కడి నుంచి నిర్మాతలు.. నిర్మాతల నుంచి మా వద్దకు వస్తుంది. కంగనా గారితో నటించాలని అందరికీ డ్రీమ్ ఉంటుంది. మహిమ గారు సెట్స్‌లో ఎప్పుడూ పాట పాడుతూనే ఉంటారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: