టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక అలా ఇండస్ట్రీలో ఇంత పెద్ద స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ ఈ స్థాయిలో ఉన్నాడు అంటే దానికి ముఖ్య కారణం తన తండ్రి. రామ్ చరణ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అన్న కారణంతో చిన్నప్పటినుండి రామ్ చరణ్ కి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని దగ్గరుండి చూసుకునేవాడు చిరంజీవి. ఇక రామ్ చరణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోగా ఎలా ఉండాలి అన్న ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా నేర్పించాడు చిరంజీవి.

ఇక హీరో అన్న తర్వాత ఫిట్నెస్ విషయంలో ఎంతలా జాగ్రత్త వహించాలో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ దిగవంత నటుడు శ్రీహరి వద్దకు రాంచరణ్ ను ట్రైనింగ్ కోసం పంపించారట. అలా ట్రైనింగ్ కోసం శ్రీహరి దగ్గరికి వెళ్లడానికి మొదట్లో రామ్ చరణ్ చాలా భయపడేవాడట. శ్రీహరి రామ్ చరణ్ ని ఆరెంజ్ లో టార్చర్ పెట్టేవారట. అలా శ్రీహరి వద్దకు రెండు రోజులు వెళ్ళిన తర్వాత మూడో రోజు నుండి ఆయన పెట్టే టార్చర్ భరించలేక రామ్ చరణ్ చిరంజీవి దగ్గరికి వెళ్లి శ్రీహరి గారి వద్దకు వెళ్ళను అని తేల్చి చెప్పేశారట. ఆయన దగ్గర ట్రైనింగ్ కోసం వెళ్తే ఆయన

 పెట్టే టార్చర్ తట్టుకోలేక నేను చేస్తాను అంటూ చిరంజీవి దగ్గరికి వెళ్లి ఇబ్బంది పెట్టాడట. ఇబ్బంది పెట్టడమే కాకుండా చిరంజీవిని నానా రకాలుగా ఈ విషయంలో టార్చర్ చేశారు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక అలా రామ్ చరణ్ తేల్చి చెప్పేయడంతో చిరంజీవి ఏం చేయలేక రామ్ చరణ్ కోసం ఒక ప్రత్యేక ట్రైనర్ ను పిలిపించి స్వయంగా ట్రైనింగ్ ఇప్పించారట. ఇక అప్పటినుండి శ్రీహరి దగ్గరికి వెళ్లాలి అంటే రామ్ చరణ్ కి ఏదో తెలియని భయం అని అంటున్నారు. అలా ఇప్పుడు రామ్ చరణ్ చిరంజీవి చేసిన టార్చర్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: