టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజ హెగ్డే గురించి ప్రతీక పరిచయం అవసరం లేదు. ఒక లైలా కోసం అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన పూజా హెగ్డే  ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరిపోయింది. దాదాపు అందరూ స్టార్ హీరోలతో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే గత కొంతకాలంగా ఈమెకి దురదృష్టం వెంటాడుతుంది అని చెప్పాలి. చేస్తున్న సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. తెలుగులోనే కాకుండా హిందీ తమిళ్ వంటి

భాషల్లో సైతం సినిమాలు చేసి భారీ గుర్తింపును తెచ్చుకున్న ఈమె  నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. దాంతో ఇప్పుడు ఈమె కెరియర్ డైలమాలో పడింది. దానికి తోడు ఇప్పుడు వచ్చిన రెండు బడా సినిమాలను పూజ హెగ్డే వదులుకుంది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో ముందుగా ఈ ముద్దుగుమ్మని హీరోయిన్గా అనుకున్నారు కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా నుండి తప్పుకుంది పూజ హెగ్డే. దానితోపాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి సైతం తప్పుకుంది.

అయితే తాజాగా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజ హెగ్డే  పెళ్లికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ప్రముఖ క్రికెర్ తో పూజ హెగ్డే పెళ్లి జరగబోతుంది అంటూ గత కొంతకాలంగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ క్రికెటర్ ఎవరు అన్నది ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఈ నేపథ్యంలోనే పూజ హెగ్డే పెళ్లి చేసుకోబోతున్న ఆ క్రికెట్ ఎవరు అని ఆరా తీరం మొదలుపెట్టారు. దీంతో పూజ హెగ్డే కి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగవారు అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: