ఆర్ ఆర్ ఆర్  సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా విజయం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం కేవలం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులే కాకుండా సినీ లవర్స్ సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అలా ఈ సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా క్షణాల్లో దాన్ని సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ చేస్తున్నారు.

ఇక ఇప్పటికీ ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్  సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ నేపథ్యంలోనే  తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్కి తల్లిగా టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి నటిస్తోంది అన్న సమాచారం వినబడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు అన్న సంగతి  అందరికీ తెలిసిందే. తండ్రీ పాత్రకి జోడిగా ప్రియమణి నటించబోతుంది అన్న వార్తలు ఇప్పుడు ఎంతో హాట్ టాపిక్ గా మారాయి.

అలా చిన్నప్పుడు ఎన్టీఆర్కు అమ్మగా ప్రియమణి ఈ సినిమాలో నటించబోతుంది అన్న సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒక సరిగా షాక్ అవుతున్నారు. ఇక దేవర సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఆమెతోపాటు సేఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు.  ఈ సినిమాకి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ మరియు జాన్వి కపూర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: