తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా కొనసాగుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పటికే ఆరు సీజన్లని ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఏడవ సీజన్ ప్రేక్షకులను అలరిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఉల్టా ఫుల్టా అనే సరికొత్త కాన్సెప్ట్ తో ప్రారంభమైన ఏడవ సీజన్ అందరూ ఊహించిన దాని కంటే కాస్త డిఫరెంట్ గా ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. హౌస్ లోని టాస్కులు ఎలిమినేషన్లు నామినేషన్లు అన్నీ కూడా సరికొత్తగానే జరుగుతూ ఉన్నాయి.


 దీంతో వినూత్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ను అలరిస్తున్న ఈ కార్యక్రమానికి రోజు రోజుకు క్రేజ్ మరింత పెరిగిపోతుంది అని చెప్పాలి. మరీ ముఖ్యంగా నామినేషన్ సమయంలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉండడం ఉండడం అయితే తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది. అయితే బిగ్బాస్ సీజన్ లో ఇప్పటివరకు మూడు ఎలిమినేషన్స్ జరిగాయి అన్న విషయం తెలిసిందే. మూడో ఎలిమినేషన్ గా బాహుబలి సింగర్ దామిని హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఆమె హౌస్ లో ఉన్నన్ని రోజులు ఎక్కువగా కిచెన్ కే పరిమితమైంది. అయితే అందరికీ వండి పెట్టడం మంచిదే. కానీ వంట మాత్రమే చేస్తే హౌస్ లో కొనసాగడం కష్టం. దామిని విషయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు చూసిన వంటగదిలోనే పనులు చేసుకుంటూ పోయింది.  కిచెన్ లో ఏ మాత్రం తేడా వచ్చిన ఎవరు పని చేయకపోయినా నోరు పారేసుకునేది. దీంతో ఆమెకు వంటలక్క అనే ట్యాగ్ కూడా ఇచ్చారు కొంతమంది ప్రేక్షకులు. మరోవైపు బూతులు మాట్లాడుతుంటే నచ్చవు అని అంటూనే ఇంగ్లీష్ లో తెగ బూతులు మాట్లాడేది. అందుకే దామిని బయటకు వెళ్లిందని అందరూ అనుకుంటున్నారు. అయితే దామిని పారితోషకం ఎంత అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈమె వారానికి రెండు లక్షల మేర పారితోషికం తీసుకుందట. మొత్తంగా మూడు వారాలకు గాను ఆరు లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: