టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప టు షూటింగ్లో బిజీగా ఉంది. దానితోపాటు రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ అనే సినిమా చేస్తోంది. ఈ మధ్య టాలీవుడ్ లో రష్మిక జోరు కాస్త తగ్గింది అందుకు కారణం యంగ్ బ్యూటీ శ్రీ లీలా అనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ రాకతో పూజ హెగ్డే రష్మిక వంటి స్టార్ హీరోయిన్ లకి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో 'పుష్ప 2' తప్పితే రష్మికకు మరో సినిమా లేదు? అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఓ క్రేజీ ప్రాజెక్టు లో నటించే ఛాన్స్ అందుకున్నట్లు లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల్లో ఓ వార్త జోరుగా ప్రచారం అవుతోంది. 

నటుడు, దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించబోయే లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ లో రష్మిక మెయిన్ లీడ్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. 'అందాల రాక్షసి' సినిమాలో హీరోగా అలరించిన రాహుల్ రవీంద్రన్ ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ 'చి ల సౌ' అనే చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే ప్రశంసలు అందుకుని, జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇక చివరిగా నాగార్జునతో 'మన్మధుడు 2' సినిమాని తెరకెక్కించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకు రాహుల్ రవీంద్రన్ మరే సినిమా తెరకెక్కించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం రష్మిక తో ఓ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మించబోతున్నారట. నిజానికి రాహుల్ రవీంద్రన్ ఈ ఫిమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ని మొదట సమంత కోసం రాసుకున్నారట. సమంత రాహుల్ రవీంద్రన్ భార్య సింగర్ చిన్మయి ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే కదా. ఆ విధంగా సమంతకి రాహుల్ ఇదివరకే కథ వినిపించాడట. సమంతకి కూడా స్క్రిప్ట్ బాగా నచ్చి ఓకే కూడా చెప్పిందట. కానీ తన ఆరోగ్య కారణాల రీత్యా ఈ ప్రాజెక్టు నుండి సమంతా తాజాగా తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సమంత ప్లేసులో రష్మికకి ఆ అవకాశం వచ్చినట్లు సమాచారం. సమంత ప్లేస్ ని రష్మిక రీప్లేస్ చేస్తూ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మొదటిసారి నటించబోతోందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: