మెగా హీరో సాయిధరమ్ తేజ్ కలర్స్ స్వాతి సోల్ ఆఫ్ సత్య అనే షార్ట్ ఫిలిం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సైనికుల భార్యల త్యాగాలను వారి మనోవేదనను తెలియజేసేలా ఈ సినిమాని తలకెక్కించారు. ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా సత్య అనే పేరుతో హృదయాలను హత్తుకునే ఒక పాటని సైతం విడుదల చేశారు. ఇక ఆ పాటలో అత్యంత భావోద్వేగమైన సైనికుల భార్యల మనోవేదనకు అద్దం పట్టేలా ఈ పాట ఉండడంతో అందరినీ కంటతడి పెట్టించింది. ఇందులో తేజ్ ఒక సైనికుడి పాత్రలో కనిపించాడు.

స్వాతి ఆయన భార్య పాత్రలో కనిపించింది. అయితే ఇదే పక్కన పెడితే మంత్ ఆఫ్ మధు అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకులు ముందుకు వస్తోంది స్వాతి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ వేడుకలను మంగళవారం నిర్వహించారు మేకర్స్. దీనికి సాయి ధరంతేజ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా స్వాతి పై పలు రకాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు సాయి ధరమ్ తేజ... స్వాతి మీ అందరికీ కలర్స్ స్వాతి కానీ నాకు మాత్రం స్వాతి గాడు.. ఎందుకు అంటే కాలేజీ రోజుల నుండి మేమిద్దరం మంచి స్నేహితులం.. కలర్స్ స్వాతిగా మొదలైన ఆమె స్వాతి అయ్యింది.. దాని తర్వాత స్వాతి గాడు అయింది..

సినిమా స్వాతికి మంచి సక్సెస్ ఇవ్వాలి అనే కోరుకుంటున్నాను.. ఆల్ ది బెస్ట్ స్వాతి అని సాయిధరమ్ తేజ పేర్కొన్నాడు. దాని వెంటనే స్వాతి ఈ హీరోను చేసుకొని బుగ్గపై ముద్దు పెట్టింది. దీంతో  పెళ్లై కూడా ఈ హీరోకి ముద్దు పెట్టడం ఏంటి అని రకరకాల కామెంట్లు చేస్తున్నారు అందరూ. అనంతరం స్వాతీ మాట్లాడుతూ మేమిద్దరం కలిసి చదువుకున్నాం.. సినిమాల్లోకి నేను ముందే వచ్చేసాను. అలా అని తనకంటే పెద్దదాన్ని కాదు కానీ మా ఇద్దరికీ ఒకే వయస్సు.. ఓకే కాలేజీలో డిగ్రీ చేసాం.. ఎగ్జామ్స్ లో నేను చూపిస్తేనే వీడు పాస్ అయ్యాడు.. ఏడాదిగా కలిసి సత్యా అనే ప్రాజెక్టు చేస్తున్నాం.. తేజ్ నా లైఫ్ లో ఎప్పుడూ సపోర్ట్ సిస్టం లా ఉంటాడు.. థాంక్యూ తేజ్ అంటూ ఈ సందర్భంగా పేర్కొంది స్వాతి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: