నాచురల్ స్టార్ నాని ఈ సంవత్సరం ఇప్పటికే దసరా మూవీ తో ప్రేక్షకులను పలకరించి అదిరిపోయి రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇకపోతే ఈ మూవీ కి కొత్త దర్శకుడు అయినటువంటి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకొని నాని కి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఇకపోతే ప్రస్తుతం నాని "హాయ్ నాన్న" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల దగ్గర పడిన నేపథ్యంలో నాని ప్రస్తుతం తన తదుపరి మూవీ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా నానితమిళ దర్శకుడి తో తన తదుపరి మూవీ చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... శివ కార్తికేయన్ హీరోగా ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా రూపొందిన డాన్ మూవీ కి దర్శకత్వం వహించి మంచి విజయాన్ని మంచి గుర్తింపును సంపాదించుకున్న సిబి చక్రవర్తి దర్శకత్వంలో నాని తన తదుపరి మూవీ ని చేయబోతున్నట్లు ... అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలువడబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే డాన్ మూవీ తెలుగు లో కూడా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: