మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ నటుడు ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అందులో ఎన్నో సినిమాలతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకున్న ఈ యువ నటుడు కొంత కాలం క్రితమే ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన గాంఢీవదారి అర్జున అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు.

ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక పోయింది. దానితో ఈ మూవీ ఘోరమైన పరాజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది. ఈ సినిమాలో సాక్షా వైద్య , వరుణ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇకపోతే గాండీవదారి అర్జున మూవీ తో భారీ ఫ్లాప్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ యువ నటుడు ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ బాలీవుడ్ బ్యూటీ మనుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఓ ప్రముఖ సంస్థ ఈ మూవీ యొక్క అన్ని భాషల నాన్ థియేటర్ హక్కులను దాదాపు 50 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తో వరుణ్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: