డైరెక్టర్ బోయపాటి శ్రీను అంటే మాస్ సినిమాలకి పెట్టింది పేరు.. ఆయన సినిమాలో హీరోగా ఎవరైనా నటిస్తే ఖచ్చితంగా వారికి మాస్ హీరో అనే పేరు వచ్చేస్తుంది. అలా తాజాగా రామ్ పోతినేనితో, బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా స్కంద ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. ఒక రకంగా ఈ సినిమా మాస్ ప్రేక్షకులను మెప్పించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఉచిత పథకాల పైన కూడా పలు రకాల డైలాగులు సన్నివేశాలతో సైతం ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.


ఈ సినిమాలోని కొన్ని పాత్రలు నిజజీవితంలోని వ్యక్తుల గురించి కూడా తెలియజేసేలా కనిపిస్తున్నాయి. మొదటి భాగంలో బోయపాటి శ్రీను తన స్టైల్ లో విరోచితమైన పోరాట సన్నివేశాలను గుర్తుకు చేశారు. రెండో భాగంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు కీలకంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా కట్టిపరేశారు. క్లైమాక్స్ సినిమాకు కీలకంగా మారిపోతుంది. ఈ సినిమా రెండో భాగం ఉంటుంది అంటూ కూడా తెలియజేశారు. రామ్ ఈ సినిమాలో తెలంగాణ యాసతో పాటు రాయలసీమలోని పలు డైలాగులను కూడా పలకడం అభిమానులను ఆనందానికి గురి చేసింది.


హీరో రామ్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించారు. స్కంద సినిమా విడుదలైన కొన్నిచోట్ల పాజిటివ్ టాక్ రాగా మరికొన్నిచోట్ల మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు డీసెంట్ రిపోర్ట్ రావడం జరిగింది. మాస్ సెంటర్లో ఆశాజనకమైన రిపోర్టింగ్ రాలేదని తెలుస్తోంది. మరి ఏ మేరకు ఈ సినిమా అభిమానులను మెప్పించి కలెక్షన్ల పరంగా రాబడుతుందో చూడాలి మరి. ఇందులో హీరోయిన్ గా శ్రీ లీల నటించింది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. శ్రీకాంత్, సాయి మంజ్రేకర్,శరత్ తదితరులు సైతం ముఖ్యమైన పాత్రలో నటించారు. మరి ఏ మేరకు మొదటి రోజు కలెక్షన్స్ రాబట్టిందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: