ఇళయ దళపతి విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం లియో. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో వస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు పక్కా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా లేటెస్ట్గా ఈ సినిమా ఆడియో లాంచ్ విషయంలో కాస్త తమిళ నాట వాతావరణం వేడిగా మారింది. మరొక పక్క కేరళలో ఈ సినిమాలో బాయ్ కాట్ చేయాలి అంటూ కేరళవాసులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇదిలా ఉండగా తాజాగా అవైటెడ్ ట్రైలర్ కట్ కోసం ఇప్పుడు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ బజ్ ఎప్పుడు వస్తుందా అని వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక లేటెస్ట్ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ ట్రైలర్ ఈ అక్టోబర్ మొదటి వారంలోనే రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కానీ ఈ విషయం తెలిసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో విజయ్ కి జోడిగా కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. అర్జున్ సార్జ అలాగే సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.  అలాగే సెవెన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ గా అక్టోబర్ 19వ తేదీన చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. వివాదాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: