ఇటీవల ఖుషి వంటే ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ దేవరకొండ మరోసారి ఇప్పుడు అలాంటి జోనర్ లోనే మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి కేరాఫ్ గా మారిన పరశురాం తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ - పరుశురాం కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ తో కలిసి దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 'VD13' అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో విజయ్ సరసన మృణాల్ ఠాగూర్ కకథానాయికగా నటిస్తోంది. 

SVC సంస్థలో వస్తున్న 54వ చిత్రం ఇది. పరశురాం మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ కలబోతగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సినిమా రిలీజ్ డేట్ తో పాటు షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ను అందించారు మేకర్స్. పరశురాం - విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న 'VD13' మూవీ షూటింగ్ 50% వరకు పూర్తయినట్లు ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు. అంతేకాకుండా త్వరలోనే టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రివిల్ చేస్తామని తెలియజేస్తూ 2024 సంక్రాంతి కానుకగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

సంక్రాంతికి ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. ఇప్పటికే  50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మిగతా భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి కచ్చితంగా సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 'గీత గోవిందం' తర్వాత విజయ్ - పరశురామ్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ సినిమా కోసం ముందుగా విజయ్ సరసన రష్మిక మందనను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ ని తీసుకున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కేయూ మోహనన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: