త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించాడు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే తర్వాత సినిమాపై అటు ప్రేక్షకుల్లో భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తారక్ ఫ్యాన్స్ అందరు కూడా ఇక నెక్స్ట్ మూవీ గురించి ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. కాగా గతంలో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివతో మూవీ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.


 అయితే మొదటి నుంచి ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇక దేవరా సినిమాపై అటు లీకుల ప్రభావం కూడా ఎక్కువగా ఉండడంతో బయటకి వస్తున్న లీకులు సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తూ ఉన్నాయి. ఇదివరకు ఇండియన్ సినీ చరిత్రలో ఎన్నడూ చూడని యాక్షన్ సీన్లను దేవర టీం డిజైన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తారక్ సైతం ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. ఇలాంటి లీక్ లు అటు నందమూరి ఫ్యాన్స్ లోనే కాదు సగటు ఆడియన్స్ లో కూడా సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు దేవర సినిమాకు సంబంధించి మరో లీక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాడట. నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేటుకు దేవర డిజిటల్ హక్కులను దక్కించుకుందట. ప్రస్తుత టాక్ ప్రకారం ఈ సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా 90 కోట్లకు అమ్ముడు పోయాయి అన్నది తెలుస్తుంది. నిజానికి ఇది భారీ నెంబరె అని చెప్పాలి. కేవలం స్ట్రీమింగ్ రైట్స్ కి ఈ రేంజ్ లో ధర పలికితే.. మిగతా రైట్స్ కి ఏ రేంజ్ లో ధర పలుకుతుందో అని అందరు అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: