
అయితే కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న శివరాజ్ కుమార్ ఇటీవల ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. శివరాజ్ కుమార్ నటించిన సినిమా ఘోస్ట్ అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. శ్రేణి డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాలో.. అనుపమ్ కేర్, ప్రశాంత్ నారాయణ్ కీలక పాత్రలో ఈ సినిమాలో నటించారు. ఈ క్రమంలోనే తన స్నేహితుడు హీరో రవితేజ గురించి శివన్న మాట్లాడుతూ.. రవితేజ స్క్రీన్ ముందే కాదు వెనక కూడా ఫుల్ ఎనర్జీతో ఉంటారని.. అతని ఎనర్జీ లెవెల్స్ ఫ్యాన్స్ కి బూస్టర్ లాంటివి అంటూ చెప్పుకొచ్చాడు.
జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉంటారని.. కన్నడ చక్కగా మాట్లాడే తారక్ ను తన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతగానో ఇష్టపడతారు అంటూ చెప్పుకొచ్చాడు. తెలుగు హీరోలందరూ తనకు చాలా నచ్చుతారని డౌన్ టు ఏర్త్ ఉంటారని చెప్పుకొచ్చాడు. మహేష్ తక్కువ మాట్లాడతారని చాలా ప్రొఫెషనల్ గా ఉంటారని.. అలాంటి వ్యక్తి స్క్రీన్ మీద మెరుపులు చూపిస్తారని శివన్న ప్రశంసలు కురిపించాడు. ఇక పవన్ కళ్యాణ్ తనకు మంచి మిత్రుడని తనలాగా ఫుల్ ఎనర్జీ ఉన్న వ్యక్తి పవన్ అని శివన్న తెలిపాడు. హీరో సూర్య లోని చిరునవ్వు క్రికెటర్ ధోనిలో కామ్ నెస్ తనకు ఎంతగానో ఇష్టమంటూ చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో అంతా ఇలా కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.