ఇటీవల కాలంలో వచ్చిన డీజే సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ నేహా శెట్టి చేసిన సందడి అంత ఇంతా కాదు. డీజేటిల్లు  సినిమా భారీ విజయాన్ని  అనుకోవడంతో ఇప్పుడు ఆ సినిమాకి సీక్వల్  గా టిల్లు స్క్వేర్ రాబోతోంది. చాలా నెలల క్రితమే మొదలైన ఈ సినిమా కొన్ని కారణాలవల్ల వాయిదా పడు తో వస్తోంది. మొదట దర్శకుడు విషయంలో దాని తర్వాత హీరోయిన్ విషయంలో ఇలా కొన్ని రకాల ఇబ్బందులు వల్ల సినిమా వాయిదా పడుతూ వస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం అదంతా పక్కన పెట్టేసి

 చకచకా షూటింగ్ జరుగుతోంది. కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. అదే రాధిక టిల్లు స్క్వేర్ లో కూడా  ఉంది అని అన్నారు. ఇటీవల రూల్స్ రంజన్ సినిమా ప్రచారం కోసం నేహా శెట్టి పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమెను.. మీరు మళ్ళీ రాధికగా కనిపించబోతున్నారా అని అడిగితే క్లారిటీ ఇచ్చింది ముద్దుగుమ్మ. టిల్లు స్క్వేర్ సినిమాలో నేను ఎలాంటి గెస్ట్ రోల్ చేయడం లేదు అని.. ఇందులో  మీరు ఎందుకు నటించడం లేదు అని చాలామంది అడుగుతున్నారు అని.. నన్ను మరోసారి రాధికగా చూడాలనేది వాళ్ళ కోరిక అని..

 ఇక సీక్వెల్ కథ చాలా వేరుగా ఉంటుంది అని.. తొలిభాగానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు అని.. అందుకే ఈ సినిమాలో నేను లేను అని క్లారిటీ ఇచ్చింది రాధిక. ఇప్పుడు ఈమె నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా అనే డౌట్ కూడా అందరిలో నెలకొంది. ఎందుకు అంటే ఏ హీరోయిన్ అయినా సరే ఇలా అడిగితే అవును నేను ఈ సినిమాలో ఉన్నాను అని చెప్పదు. ఆ లెక్కన నేహా సైతం ఈ సినిమా విషయంలో అలాంటి అబద్దమే చెప్పి ఉండొచ్చు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఈ విషయంపై ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చేది కూడా సినిమా వచ్చినప్పుడే.  ప్రస్తుతానికి రాధిక కి సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: