ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి మాత్రమే మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. కానీ ఇటీవల కాలం లో మాత్రం మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తూ ఉంది అని చెప్పాలి. ఒక స్టార్ హీరో నటిస్తున్న సినిమాల్లో మిగతా స్టార్ హీరోలు కీలక పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇలా ఇక కీలకపాత్రలో స్టార్ హీరోలను నటింప చేయడం కూడా దర్శక నిర్మాతలకు బాగా కలిసి వస్తుంది.


 ఈ క్రమంలోనే ప్రతి దర్శకుడు కూడా ఇలా సినిమాల్లో ఇద్దరు హీరోలు ఉండేలా చూసుకుంటున్నారు. మెయిన్ హీరో ఒకరు అయితే కథను కీలక మలుపు తిప్పే సర్ప్రైజింగ్ పాత్రలో కనిపించే మరో హీరో ఉంటే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తూ అలాంటి కథలను ఎక్కువగా రాసుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇలా వచ్చిన సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాలోనూ రజిని మెయిన్ హీరోగా కీలకపాత్రలో శివరాజ్ కుమార్, మోహన్లాల్ నటించి అదరగొట్టారు.


 ఇక ఇప్పుడు రజనీకాంత్ తన 170 సినిమాలో కూడా ఇలాంటి స్ట్రాటజీనే ఫాలో అవ్వాలని అనుకుంటున్నాడు అన్నది తెలుస్తుంది. జై భీమ్ ఫేమ్ జ్ఞానవేలు రాజా దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధమ పాత్రలో ఒక మూవీ తెరకెక్కుతుంది . ఇప్పటికే  రితికా సింగ్, మంజు వారియర్ సినిమాలో నటిస్తున్నారని తెలుపగా.. ఇక ఇప్పుడు దగ్గుబాటి రానా ఫహద్ ఫాసిల్ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు చిత్రబంధం ప్రకటించిం. ది దీంతో ఈ మూవీపై భారీ రేంజ్ లో అంజనాలు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. 

ఇప్పటికే జైలర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రజినీకాంత్ ఇక ఇప్పుడు ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ సృష్టించబోతున్నాడు అని అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: