విడుదల అయిన 24 గంటల సమయంలో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 6 సౌత్ ఇండియన్ మూవీస్ ట్రైలర్స్ ఏవో తెలుసుకుందాం.

తలపతి విజయ్ తాజాగా లియో అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 2.64 మిలియన్ లైక్స్ దక్కాయి.

తలపతి విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 2.22 మిలియన్ లైక్స్ ను సాధించింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు.

తలపతి విజయ్ హీరోగా రూపొందిన వారసు మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 1.83 మిలియన్ లైక్స్ లభించాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

తలపతి విజయ్ హీరోగా రూపొందిన బిగిల్ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 1.66 మిలియన్ లైక్స్ దక్కాయి.

అజిత్ హీరోగా రూపొందిన వలిమై మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 1.33 మిలియన్ లైక్స్ లభించాయి.

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో 1.24 మిలియన్ లైక్స్ లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: