మాస్ మహారాజ రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇకపోతే ఈ సినిమాలో నుపూర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ ... రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించారు. వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ వారు నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో అక్టోబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. 

ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను మరియు రెండు పాటలను విడుదల చేసింది. వీటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క మూడవ పాటను అక్టోబర్ 12 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

మూవీ టైగర్ నాగేశ్వరరావు అనే బందిపోటు దొంగ జీవిత కథ ఆధారంగా రూపొందింది. దానితో ఈ సినిమాలో రవితేజ కూడా బందిపోటు దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు. రవితేజ కెరియర్ లో ఇదే మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై రవితేజ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే రవితేజ కు ఈ మూవీ తో ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించే అవకాశాలు చాలా వరకు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: