తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైర్మెంట్ అందిస్తున్న బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకుల ఊహ కందని ట్విస్టులతో ఈ ఏడాది సీజన్ మొత్తం ఆయనతో ఆసక్తికరంగా సాగిపోతుంది. ఉల్టా పుల్టా అంటూ వినూత్నమైన కాన్సెప్ట్ తో షో స్టార్ట్ చేసిన నిర్వాహకులు   అందుకు తగ్గట్లుగానే ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు అని చెప్పాలి  ఇక ఎప్పటిలాగానే షాకింగ్ ఎలిమినేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి  ఇకపోతే హౌస్ లోకి కొత్తగా వచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ముద్ర వేసుకొని నయని పావని హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే నయని పావని ఉన్నది ఒకే వారం అయినప్పటికీ ఇక ఆమె వెళ్తుంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా శివాజీ అయితే తను ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని మనస్ఫూర్తిగా.. నేను తనకి బదులుగా బయటకి వెళ్ళిపోతాను అంటూ చెప్పాడు. కానీ ఇది ఆడియన్స్ ఓటింగ్స్.. ఎవరు వెళ్లాలి అన్నది వారే డిసైడ్ చేస్తారు అని నాగార్జున చెప్పడంతో ఊరుకున్నాడు. అంతా బాగానే ఉంది కానీ షో పూర్తయిన తర్వాత ప్రోమోలో శివాజీ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయినట్లు చూపించారు.


 ఎందుకు ఇంత సడన్గా శివాజీని బయటికి పంపిస్తున్నారు అన్నది ఎవరికి అర్థం కాలేదు. అయితే ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరిలో కూడా ఇదే విషయంపై చర్చ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఇదంతా డ్రామా అయి ఉండవచ్చు అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. ఇక ఆదివారం ఎపిసోడ్లో శివాజీ చెప్పినట్లుగా తన చేతికి బ్యాక్ బోన్ కి సమస్య ఉండడంతో  ట్రీట్మెంట్ ఇప్పించేందుకే బిగ్ బాస్ బయటకు తీసుకెళ్లి ఉంటాడని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇంకోవైపు చంద్రబాబు అరెస్టు గురించి శివాజీకి తెలిసిపోయిందని అందుకే ఇక బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేసి మరి శివాజీ హౌస్ నుంచి బయటకు వెళ్లాడని.  ఒక టాక్ చక్కర్లు కొడుతుంది  ఇందులో ఏది నిజం అని తెలియాలంటే మాత్రం ఈరోజు ఎపిసోడ్ ప్రసారం అయ్యేంతవరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: