అయితే ఇప్పుడు కంగనా రనౌత్ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ తెలిపింది.. ఎమర్జెన్సీ సినిమా విడుదల తేదీ వాయిదా పడిందని ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ఈమె ప్రకటించడం జరిగింది..కంగనా రనౌత్ ట్విట్ చేస్తూ సుదీర్ఘమైన పోస్టుని షేర్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ విడుదల తేదీని మార్చడానికి గల కారణం తెలియజేసింది.. ఎమర్జెన్సీ సినిమా గురించి ఒక ముఖ్యమైన ప్రకటన మీ అందరితో షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చాను.. ఎమర్జెన్సీ సినిమా షూటింగ్ సమయంలో నటిగా తానెంతో నేర్చుకున్నాను అని తెలిపింది.
ఆర్థికంగా కూడా చాలా విషయాల పైన అవగాహన పెంచుకోవడం జరిగింది. ఎమర్జెన్సీ అనేది నాకు మాత్రమే కాదు నా విలువలకు పాత్రలకు కూడా ఒక పరీక్ష ఈ సినిమా టీజర్ వచ్చిన రెస్పాన్స్ ఇతర సంగతులు చిత్ర బృందం మొత్తానికి ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా చేశాయి.. అందుకు కృతజ్ఞతలు అంటూ తెలుపుతోంది. నవంబర్ 24న ఈ సినిమా ఈ ఏడాది ప్రకటించాము అయితే నేను నటించిన సినిమాలన్నీ వరుసగా విడుదలకు సిద్ధంగా ఉండడంతో 2024 చివరి వరకు తన మూవీస్ ఉండడంతో ఎమర్జెన్సీ సినిమా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేస్తున్నామని తెలుపుతోంది..త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించే బోతున్నట్లు తెలిపింది కంగనా రనౌత్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి