నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా భగవంత్ కేసరి అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఈ మూవీ సెట్స్ పై ఉండగానే బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి బాబి దర్శకత్వంలో ఒక మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అలాగే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడి చాలా కాలం అవుతుంది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ తాజాగా భగవంత్ కేసరి సినిమాకు సంబంధించిన పనులు అన్ని పూర్తి చేసుకోవడంతో బాబి మూవీ షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ ... బాబి కాంబో లో తెరకెక్కబోయే మూవీ చిత్రీకరణ ఈ నెల 6 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ను భారీ యాక్షన్ సన్నివేశంతో ఈ మూవీ బృందం స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లోని ఈ యాక్షన్ సన్నివేశాన్ని ఈ మూవీ మేకర్స్ అత్యంత భారీ ఖర్చుతో సూపర్ గా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ మూవీ కే హైలెట్ గా నిలవబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే బాబి ఆఖరుగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేర్ వీరయ్య సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ హీరోగా నటించనున్న మూవీ కావడం ... వాల్టేరు వీరయ్య లాంటి సూపర్ సక్సెస్ తర్వాత బాబీ దర్శకత్వం వహించనున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: