ఇదంతా ఇలా ఉంటే వ్యూహం సినిమా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. అయితే ఈ చిత్రాన్ని వర్మ వ్యూహం, శపధం అనే రెండు పార్టీలుగా విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. వ్యూహం సినిమాని నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించగా కానీ సెన్సార్ బోర్డు అభ్యంతరాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఈ చిత్రంలో తమను కించపరిచేలా ఉన్నాయంటూ టిడిపి నాయకుడైన లోకేష్ సెన్సార్ బోర్డుకి సైతం లేఖ రాసినట్లుగా తెలుస్తోంది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..
దీంతో వర్మ రివైజింగ్ కమిటీ చూసిన తర్వాత కొత్త విడుదల తేదీని తెలియజేస్తామంటూ వర్మ గతంలో తెలిపారు. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ అనుమతి ఇస్తుందా లేదా అని అనుమానాలు కూడా అందరిలోనూ ఉన్నాయి..తాజాగా వర్మ ఒక ట్విట్ చేయడం జరిగింది వ్యూహం సినిమా త్వరలోనే థియేటర్లో విడుదల కాబోతోంది . ఇందులో భాగంగా ఒక పోస్టర్ను ట్వీట్ చేశారు. వ్యూహం సినిమా నేరుగా ఓటీటి లో విడుదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి ఈ వార్తలు అన్నిటిని కూడా వర్మ ఖండిస్తూ ఇలా తెలియజేయడం జరిగింది. దీని బట్టి చూస్తే త్వరలోనే వ్యూహం సినిమా థియేటర్లో రాబోతోందని వర్మ తెలియజేశారు. గతంలో కూడా ఉడ్త పంజాబ్ ,పద్మావత్ వంటి చిత్రాలకు కూడా కోర్టు నిలిపివేయడం జరిగింది. వర్మ కూడా చట్టపరమైన పద్ధతుల ద్వారానే వ్యూహం సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి