రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా రిలీజ్ కి రెడీ అయింది  ఈ సినిమాను డిసెంబర్ 1 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను లాక్ చేసింది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను 3 గంటల 21 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇలా ఈ మూవీ యూనిట్ మరి ఇంత భారీ నిడివి తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించడంతో ఈ మూవీ ఏమైనా విసుగు తెప్పిస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు భావించారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సందీప్ మాట్లాడుతూ ... ఈ మూవీ రన్ టైమ్ గురించి మీరు పెద్దగా కంగారు పడకండి. ఈ సినిమా మీకు ఏ మాత్రం బోరు కొట్టించదు. చివరి వరకు మిమ్మల్ని ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటి.వరకు ఈ సినిమా మొత్తం రన్ టైమ్ ఎంతో అనే విషయం మనకు తెలుసు. కానీ ఈ మూవీ యొక్క ఫస్టాఫ్ ఎంత రన్ టైమ్ ... సెకండ్ హాఫ్ ఎంత రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే విషయం మీకు తెలియదు.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ఫస్ట్ ఆఫ్ 1 గంట 45 నిమిషాల నిడివితో ఉండబోతున్నట్లు ... అలాగే ఈ మూవీ యొక్క సెకండాఫ్ 1 గంట 36 నిమిషాల నిడివి తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు బారి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని మంచి విజయాన్ని అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: