నందమూరి బాలకృష్ణ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో వచ్చిన మొట్ట మొదటి చిత్రం భగవంత్ కేసరి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీ లీల కీలకమైన పాత్రలో నటించడం జరిగింది. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోవడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద వందకోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఓటీటి లో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇతర భాషలలో కూడా ఈ చిత్రాన్ని స్ట్రిమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.


అయితే ఈ సినిమా తమిళ్ హిందీ వంటి భాషలలో కూడా విడుదల చేసినట్లు సమాచారం... భగవంత్ కేసరి సినిమా అని తమిళ ప్రేక్షకులు చూసి.. బాలయ్య సైతం ప్రశంసిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ ప్రేక్షకులు గతంలో ఎన్నోసార్లు బాలయ్యను ట్రొల్ చేయడం జరిగింది.కానీ ఇప్పుడు బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాను చూసి బాలకృష్ణ ను ప్రశంసిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సన్నివేశం గురించి బాలయ్య ఎంతో అద్భుతంగా చెప్పారు అని ఇలాంటి విషయాలను ఎన్నో వేదికల పైన తెలియజేస్తూ తమిళ ప్రేక్షకులు మంచి పాపులారిటీ చేస్తున్నారట.


ఏది ఏమైనా బాలయ్య భగవంతు కేసరి సినిమాతో ఇతర భాషలలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారని చెప్పవచ్చు. ఇందులో ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా పొలిటికల్ వైపుగా కూడా బాలయ్య అడుగులు వేస్తూ వచ్చే ఎన్నికలలో గెలవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి ఈసారి బాలయ్య ఎలాంటి కాన్సెప్ట్ తో వస్తారో చూడాలి మరి. సీనియర్ హీరోలలో వరుసగా హ్యాట్రిక్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు బాలయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: