టాలీవుడ్ బుల్లితెరపై ప్రస్తుతం ఉన్నా యాంకర్ లలో శ్రీముఖి టాప్ ప్లేస్ లో ఉంటుంది అని చెప్పొచ్చు. టీవీ ఓటిటి షో లతో ప్రస్తుతం క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉంది ఈ చిన్నది. సినిమాల్లో అనుకున్నంత సక్సెస్ కాలేకపోవడంతో  బుల్లితరపై అడుగుపెట్టింది ఈమె. అలా తిరుగులేకుండా ఇప్పుడు షోస్ చేస్తూ స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. అయితే  మంగళవారం నాడు అభిమానులతో సరదాగా కాసేపు ముచ్చటించింది. తన లవ్ స్టోరీ తో పాటు పెళ్లికి సంబంధించిన పలు రకాల విషయాలను కూడా తెలియజేసింది.

అయితే లవ్ లో ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అని ఒక అభిమాని తనని అడిగారు.. ఈ క్రమంలోని శ్రీముఖి సమాధానం చెబుతూ "బొచ్చేడు సార్లు "అని టక్కున సమాధానం చెప్పింది.. అలా   తనదైన శైలిలో ప్రశ్నకు సమాధానం చెప్పింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి అయితే యాంకరింగ్ మానేస్తారా అని ఫ్యాన్ అడిగితే.. పెళ్లి అయినా యాంకరింగ్ మానేసి లేదు అని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని కూడా చెప్పింది. ఎప్పుడు అని అడిగితే మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఎంతో కొంత నా గురించి చెప్పుకొని మీకు దగ్గర కావాలనే బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో

పెట్టానని ఓ ఫ్యాన్ ప్రశ్నకు సమాధానం చెప్పింది శ్రీముఖి. ఒకవేళ ఎవరైనా బాధలో ఉన్నా కాసేపు వాళ్లను డైవర్ట్ చేసి నేను డైవర్ట్ అవుదామన్నదే బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ పెట్టడానికి కారణమని తెలిపింది. ఇక ఈ ముద్దుగుమ్మ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆదివారం విత్ స్టార్ మా పరివారం డాన్స్ ఐకాన్ సారంగదరియాతోపాటు ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ సీజన్ 2 కి కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. దాంతోపాటు సోషల్ మీడియాలో సైతం తనకి సంబంధించిన హాట్ హాట్ ఫోటోలని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలా ఎంత బిజీగా ఉన్నా కూడా తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటిస్తుంది శ్రీముఖి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: