బాలీవుడ్ టాప్ హీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఇంకా స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ డంకీ.బాలీవుడ్ లో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న డంకీ మూవీ డిసెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక సినిమా నుండి ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్  అంచనాలను అమాంతం పెంచేసింది.షారుక్ ఖాన్ ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్స్ లోకి వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలో వారి అంచనాలను మరింత పెంచేస్తూ.. డంకీ స్టోరీ ఇదే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీంతో డంకీ కథేంటో తెలుసుకోవడానికి షారుఖ్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.ఇక వైరల్ అవుతున్న వార్త ప్రకారం డంకీ మూవీ కథ ఏంటంటే.. పంజాబ్ లోని ఒక పల్లెటూరిలో ఉండే నలుగురు స్నేహితులు. వారికి ఇంగ్లాండ్ దేశానికి వెళ్లాలనే కోరిక ఉంటుంది. కానీ వారికి టిక్కెట్,వీసా అనేవి లభించవు. దాని కోసం వారు చాలా ప్రయత్నిస్తారు. అయితే చివరికి వారికీ సహాయం చేయడానికి ఓ సైనికుడు ముందుకు వస్తాడు.


అలా మొదలైన వారు ఇంగ్లాండ్ ప్రయాణం, ఆ ప్రయాణంలో వారు ఎదుర్కొన్న సమస్యలు, స్నేహం, ప్రేమ ఇంకా కుటుంబం చుట్టూ జరిగేది మిగిలిన కథ.అక్రమంగా బార్డర్స్ లో జరిగే ప్రయాణాలు, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఇంకా అవి చాలా ఫన్ తో కూడుకున్నవిగా ఉండనున్నాయట. ఇక ఓపక్క ఫన్ జనరేట్ అవుతూనే.. ఎమోషనల్ గా కూడా సాగుతుందట ఈ కథ. స్టోరీ వింటుంటేనే చాలా కొత్తగా అనిపిస్తున్న ఈ కథను దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఎలా తెరకెక్కించారా అని ఆడియన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా అంతేకాదు ఇలాంటి రియలిస్టిక్ కథలను జనాలకు నచ్చేట్టుగా స్క్రీన్ పైకి తీసుకురావడంలో రాజ్ కుమార్ హిరానీ దిట్ట. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయం సాధించడం పక్కా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ప్రేక్షకుల అంచనాలను ఈ డంకీ సినిమా అందుకుంటుందా? లేదా? అనేది తెలియాలంటే డిసెంబర్ 21 దాకా ఆగాల్సిందే. ఈ సినిమా నిడివి 2 గంటల 40 నిముషాలు ఉంటుందట. డిసెంబర్ 7 నుంచి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: