ప్రముఖ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ఒక్క ప్లాప్ కూడా లేని స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన చిత్రం 'భగవంత్ కేసరి'. ఈ సినిమా ఫస్ట్ నుంచి పాజిటివ్ టాక్ తో 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి హిట్ గా నిలిచింది. ఇక ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రియులంతా ఎంతో ఎదురుచూశారు.ఫైనల్ గా వాళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో ఆడియన్స్‌తో ఈలలు వేయించిన ఈ సినిమా ఓటీటీలో కూడా అదే హవా చూపిస్తోంది.స్ట్రీమింగ్‌ మొదలైన కొన్ని గంటల్లోనే అత్యధిక వ్యూస్‌ సాధిస్తూ ఈ సినిమా టాప్‌లో నిలిచింది. సందేశాత్మక చిత్రంగా రూపొందిన 'భగవంత్ కేసరి' సినిమా తెలుగుతో పాటు, హిందీ, తమిళ, కన్నడం, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్‌ అవుతూ.. అమెజాన్‌లో టాప్‌లో కొనసాగుతోంది. ఇక తెలుగు వెర్షన్‌ టాప్‌ వన్‌లో ట్రెండింగ్‌లో ఉండగా.. హిందీ వెర్షన్‌ టాప్ 3లో ఈ సినిమా నిలిచింది. అలాగే గూగుల్లో అత్యధిక మంది వెతికిన సినిమాగా కూడా రికార్డు సృష్టించింది.


ఇంకా ఈ విషయాన్ని తెలుపుతూ అమెజాన్‌ పోస్టర్‌ విడుదల చేసింది.అలాగే తమ భాష సినిమా తప్ప ఏ సినిమాని ఆదరించని భాష పిచ్చి ఉన్న తమిళ ప్రేక్షకులు ఈ సినిమాని చాలా లైక్ చేస్తున్నారు. ఒకప్పుడు బాలయ్యని ట్రోల్ చేసిన వారే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే సీన్ కి తమిళ జనాలు ఫిదా అయ్యారు.మొత్తానికి ఈ సినిమాతో బాలయ్యకు మంచి రెస్పెక్ట్ దక్కింది.ఆడపిల్లలను సింహాల్లా పెంచాలనే మంచి సందేశంతో రూపొందిన ఈ సినిమాలోని డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నేలకొండ భగవంత్‌కేసరి పాత్రలో బాలకృష్ణ తన యాక్టింగ్‌తో బాగా అదరగొట్టారు. ఇంకా అలాగే అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. అందువల్ల ఈ సినిమాకు ఊహించిన దాని కంటే మంచి స్పందన వచ్చింది. ఇంకా అలాగే విడుదలైన వారానికి కొత్తగా పాటను యాడ్‌ చేయడంతో ప్రేక్షకులు థియేటర్‌కు క్యూ కట్టారు. ఈ సినిమా బాలకృష్ణకు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: