ప్రస్తుతం ప్రభాస్ ... నాగార్జున ... బాలకృష్ణ ... జూనియర్ ఎన్టీఆర్ ... రామ్ చరణ్ ... రామ్ పోతినేని లకు సంబంధించిన మూవీ లు చిత్రీకరణ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం వీరు ఏ సినిమాలో నటిస్తున్నారు ..? ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కమల్ హాసన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం నా సామి రంగ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు రామోజీ ఫిలిం సిటీ లో ప్రస్తుతం నాగార్జున మరియు మరి కొంత మంది ఇతరులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.


బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న "ఎన్ బి కె 109" సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఊటీ లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  రామోజీ ఫిలిం సిటీ లో ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామ్ చరణ్ మరియు అంజలి పై కీలక సన్నివేశాలను మైసూర్ లో చిత్రీకరిస్తున్నారు. రామ్ పోతినేని ప్రస్తుతం డబల్ ఈస్మార్ట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ముంబై లో రామ్ మరియు కావ్య తప్పర్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: