బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం యానిమల్.. ఈ చిత్రం కోసం అటు బాలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాకు భారీ హైప్ ఏర్పడింది. ఇందులో రష్మిక కూడా హీరోయిన్గా నటించింది అలాగే బాబి డియోల్ విలన్ గా నటించారు. గత కొద్దిరోజుల నుంచి పాన్ ఇండియా లెవెల్లో యానిమల్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చూసిన నేటిజన్స్ సైతం ట్విట్టర్లో ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారో తెలుసుకుందాం.


డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మార్కులోనే ఈ సినిమా ఉందని అన్ని అంచనాలకు మించిపోయేలా ఉందంటూ ఇంటర్వెల్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని మొదటి 15 నిమిషాలు అసలు ఎవరు మిస్ కావద్దంటూ ఓవరాల్ గా ఈ సినిమా అదిరిపోయింది అంటూ ఒక నేటిజన్ ట్విట్టర్ చేయడం జరిగింది.సినిమా ఒక సరికొత్త కొడుకు తండ్రుల బంధాన్ని చూపించబోతున్నారు.. ఆ కోణం మనం చూసేటప్పుడు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం కానీ ఆ కోణాన్ని ఇందులో డైరెక్టర్ బాగా చూపించారని బాలీవుడ్లో ది బెస్ట్ సినిమా ఇదేనంటూ కూడా తెలిపారు. అంతేకాకుండా రణబీర్ అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారని.. అది కూడా లాంగ్ రన్ టైం తో ప్రయోగం చేయడం ఒక వైలెన్స్ తో అదరగొట్టేయడం కేవలం ఈ డైరెక్టర్ కే సాధ్యమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రణబీర్ కపూర్ అద్భుతంగా నటించారని ఈ జనరేషన్ కి తగ్గట్టుగా ఇందులో నటించడం జరిగిందని బాలీవుడ్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే నటుడుగా జీవించేసారని.. విలన్ గా నటించిన బాబి డియోల్ మాత్రం అందరిని భయపెట్టేసారని తన బాడీ లాంగ్వేజ్ తో ఒక భయాన్ని సృష్టించారని ఈ సినిమా అన్ని రికార్డులను సైతం బద్దలు కొట్టబోతోంది అంటూ మరొక నేటిజన్ తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: