శుక్రవారం వచ్చిందంటే చాలు చాలామంది సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటి లో సినిమాలు విడుదల కోసం థియేటర్లో సినిమాలు విడుదల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.. ఈమధ్య చాలా చిత్రాలు థియేటర్లో విడుదలైన నెల రోజులలోపే ఓటీటి లో వచ్చేస్తూ ప్రేక్షకులను బాగా త్రిల్ కు గురి చేస్తున్నాయి. ప్రతివారం లో కూడా పద్దుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ఉన్నాయి.. కంటెంట్ బాగుంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి సినిమాని కూడా ప్రేక్షకుల సైతం ఎక్కువగా ఆదరిస్తూ ఉన్నారు. అలా కరోనా సమయంలో చిన్న సినిమాగా వచ్చిన మా ఊరి పొలిమేర సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.


అలా ఈ సినిమా సీక్వెల్ కు భారీ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా థియేటర్లో విడుదల చేయడం జరిగింది. చిత్ర బృందం. ఈ చిత్రానికి డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించగా.. రాజేష్ ,బాలాదిత్య, గెటప్ శ్రీను, కామాక్షి తదితరులు సైతం ఇందులో నటించడం జరిగింది. ఈ చిత్రంలో సత్యం రాజేష్ నటనకు సైతం అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా విడుదలైన వారం రోజుల లోపే ఈ సినిమా లాభాలలో నిలిచింది.ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటి లో విడుదలవుతుందంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సైతం తాజాగా ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది. అదేమిటంటే ఈ చిత్రాన్ని డిసెంబర్ 8వ తేదీన ప్రముఖ ఓటిటి సంస్థ ఆయన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.దీంతో ఈ సినిమా ఆరోజున స్ట్రిమింగ్  కాబోతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా వెలువబోతున్నట్లు సమాచారం. ఇందులోని ప్రతి ఒక్కరి నటన అద్భుతంగా నటించడంతో ఈ సినిమాకు భారీ హైప్ ఏర్పడింది మరి ott లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: