సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన  'సలార్' ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అంతా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో నిండిపోయింది. దాదాపు 3 నిమిషాల 47 సెకండ్ల రన్ టైం తో ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. అలాగే కేజీఎఫ్ తో ఈ మూవీకి ఎలాంటి సంబంధం లేదని ట్రైలర్ తో చెప్పేశారు. ట్రైలర్ చూశాక ఇది కంప్లీట్ గా ఫ్రెష్ స్టోరీ లాగా అనిపించింది. ఇద్దరి స్నేహితుల మధ్య ఉండే బాండింగ్ ని ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద యూ శత్రువులు అయితే ఎలా ఉంటుందనే లైన్ తో ఈ మూవీ తీసినట్లు 

రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ చెప్పాడు. కాకపోతే ట్రైలర్లో తన ఫ్రెండ్ కి ఆపద వచ్చిందని తెలిసి ప్రభాస్ ఫ్రెండ్ కోసం పోరాడడం చూపించారు. సినిమా రెండు భాగాలు కాబట్టి మొదటి భాగంలో వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఆ తర్వాతి భాగంలో వీళ్ళిద్దరి మధ్య వైరం గురించి చూపిస్తారేమో తెలీదు కానీ ప్రాణ స్నేహితుడికి ఆపద వచ్చిందని తెలిసి ప్రభాస్ విలన్స్ తో తలపడే షాట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇందులో ప్రభాస్ దేవా అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు ట్రైలర్ లో చూపించారు. అతని ప్రాణ స్నేహితుడు వరదరాజమన్నార్ పాత్రలో మలయాళ స్టార్ హీరో 

పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించారు. ఇక ట్రైలర్ లో సినిమాలో ఉన్న మెయిన్ లీడ్స్ అందర్నీ చూపించారు. ప్రభాస్ ఉన్న యాక్షన్స్ సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలా వేరే లెవెల్ లో ఉన్నాయి. ఆ యాక్షన్స్ కి రవి బస్రూర్ బీజీయం మేజర్ హైలెట్ అనే చెప్పాలి. ఇంతకుముందెన్నడు ప్రభాస్ ని ఇలా చూడలేదు. ఇక ట్రైలర్ లో ప్రభాస్ చెప్పిన ప్రతీ డైలాగ్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. సినిమాలో ప్రభాస్ ఆర్మీ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక కేజిఎఫ్ కోసం ఓ సరికొత్త సామ్రాజ్యాన్ని సృష్టించినట్లుగానే సలార్ కోసం ఖాన్సార్ అనే ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు ప్రశాంత్ నీల్. కాగా హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: