తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న 'యానిమల్' మూవీ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగ సందీప్ అప్ కమింగ్ ఫిలిమ్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'యానిమల్' తర్వాత తమ కాంబినేషన్లో వచ్చే నెక్స్ట్ మూవీ స్టోరీ రెడీ అయిందని, మరో రెండు, మూడు నెలలో నెక్స్ట్ ప్రాజెక్ట్ పై సందీప్ వర్క్ చేస్తారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా స్పిరిట్ మూవీ తో పాటు అల్లు అర్జున్ తో సందీప్ రెడ్డి చేయబోయే సినిమా గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. "స్పిరిట్ తర్వాత అల్లు అర్జున్ గారితో ప్రాజెక్ట్ ఉంది. ఇంకా అందుకు సంబంధించి ఎలాంటి స్టోరీ రెడీ అవ్వలేదు. 

ఎందుకంటే అల్లు అర్జున్ గారికి పుష్ప ఉంది. మాకు అనిమల్ ఉంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఇంకో ప్రాజెక్టుకి కమిట్ అయ్యారు. అదే సమయంలో మాకు స్పిరిట్ ప్రాజెక్ట్ ఉంది. ఇవి అయ్యాకే అల్లు అర్జున్ గారితో సినిమా స్టార్ట్ చేయాలనే ప్లాన్ మీద ఉన్నాము, తప్పితే అల్లు అర్జున్ ప్రాజెక్టు సంబంధించి ఇంకా ఆన్ పేపర్ వర్క్ ఏమి స్టార్ట్ అవ్వలేదు" అని అన్నారు. స్పిరిట్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్స్ తర్వాత సందీప్ రెడ్డి ఏ హీరోతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు అని అడిగితే.. " ప్రత్యేకంగా ఈ హీరో అని కాకుండా స్టోరీ డిమాండ్ చేస్తే ఓ స్పెసిఫిక్ రోల్ కోసం ఈ హీరో కావాలి 

అనుకుంటే సందీప్ ఆ హీరోని కన్విన్స్ చేస్తారు. ఒకసారి సందీప్ నెరేషన్ విన్నాక హీరో కూడా కన్విన్స్ అవ్వాలి. అప్పుడే ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. అంతేగాని ప్రత్యేకంగా ఈ హీరో అని ఏమీ లేదు. ఇక స్పిరిట్ విషయానికొస్తే ఇందులో ప్రభాస్ కాప్ రోల్ చేస్తున్నారు. ఫిబ్రవరి, మార్చ్ లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్ స్టార్ట్ చేస్తాం" అంటూ తాజా ఇంటర్వ్యూలోచెప్పుకొచ్చాడు ప్రణయ్ రెడ్డి వంగా. దీంతో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: