ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న తరుణంలో అందరు డైరెక్టర్లు కూడా తమ సినిమాలను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా తమ సినిమాల కోసం ఇతర భాష నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. అయితే కొంత మంది డైరెక్టర్లు మాత్రం ఇతర భాషల్లో సినిమాలని తెరకెక్కిస్తూ మంచి ఫలితాలను అందుకుంటున్నారు. అసలు సౌత్ , నార్త్ అన్న భేదాలు లేకుండా తమ ట్యాలెంట్తో అక్కడ కూడా ఫాస్ట్ గా దూసుకెళ్తున్నారు. ఇక ఈమధ్యనే వచ్చిన తమిళ డైరెక్టర్ అట్లీ  జవాన్ సినిమా అందుకు నిదర్శనం. పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఆ సినిమా హిందీతో పాటు అన్ని భాషల్లో విశేషాదరణ అందుకుని బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షలను సాధించి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.దీంతో అట్లీ పేరు నార్త్లో బాగా మారుమోగిపోయింది. అప్పటివరకు కేవలం సౌత్కు మాత్రమే పరిమితమైన ఈ స్టార్ డైరెక్టర్.. ఒక్క సారిగా పాన్ ఇండియా లెవెల్లో పాపులరైపోయారు.


ఇప్పుడు షారుఖ్, విజయ్ లతో మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేస్తున్నాడు అట్లీ.ఇక 'జవాన్‌'కి ముందే మన సౌత్ నుంచి వెళ్లిన సందీప్ రెడ్డి వంగా 'కబీర్ సింగ్' సినిమాతో మంచి కమర్షియల్‌ బ్లాక్ బస్టర్‌ హిట్ ని సొంతం చేసుకున్నారు. 'అర్జున్ రెడ్డి' సినిమాకి రీమేక్గా ఈ సినిమా తెరకెక్కగా.. అప్పటి దాకా ఉన్న సందీప్ స్టార్డమ్ను అమాంతం పెంచేసింది. ఇంకా అంతే కాకుండా షాహిద్ కపూర్కు సాలిడ్ హిట్ పడటం వల్ల అందరి దృష్టి ఈ యంగ్ డైరెక్టర్పై పడింది. ఇక ఇదే జోరుతో సందీప్ ఇప్పుడు యానిమల్ సినిమాతో బాలీవుడ్లో మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ సినిమా సాలిడ్ హిట్ తో సూపర్ వసూళ్ళని సాధిస్తుంది.ఇక 'జవాన్' సినిమా అయితే సౌత్ ఇండియాలో దాదాపుగా రూ.150 కోట్ల వసూళ్లను నమోదు చేయగా అన్ని భాషల్లో కలిపి 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డుకెక్కింది.ఇక 'యానిమల్‌' సినిమా అయితే అన్ని భాషల్లో కలిపి మొదటి రోజు ఏకంగా 116 కోట్ల వసూళ్ళని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: