టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో పుష్ప 2 ఒకటి. పుష్ప పార్ట్ వన్ వచ్చి రెండేళ్లు అవుతుంది.. కానీ పార్ట్ 2 ఇంకా షూటింగ్ దశ లోనే ఉంది. షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతంది..మూవీ రిలీజ్ ఎప్పుడంటూ ఫ్యాన్స్ అంతా ఆరాటపడుతున్నారు. పైగా అప్పుడు అప్‌డేట్స్ వదిలి మూవీ బజ్ పెంచాడు సుకుమార్. దీంతో పుష్ప 2 రిలీజ్ కోసం ఫ్యాన్స్ అంత ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. ఈ క్రమం లో ఫ్యాన్స్‌ని మరింత డిసప్పాయింట్ చేస్తూ ఓ వార్త సోషల్ మీడియా లో నిలిచింది. ఈ తాజా బజ్ ప్రకారం.. పుష్ప 2 షూటింగ్‌కు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. దీనికి కారణం అల్లు అర్జున్ హెల్త్ ఇష్యూ అని తెలుస్తోంది. కాగా రీసెంట్‌గానే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసిన సుకుమార్.. రామోజీ ఫిలిం సిటీ లో బన్నీతో యాక్షన్ సీక్వెన్స్ చేయిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అల్లు అర్జున్‌ కు తీవ్రమైన వెన్నునొప్పి వచ్చిందని సమాచారం. దీంతో చిత్ర షూటింగ్‌ ను డిసెంబర్ రెండవ వారానికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలు నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. కాగా రామోజీ ఫిలిం సిటీలో అల్లు అర్జున్, రష్మిక మందన్న కాంబినేషన్‌లో ఓ సాంగ్ ఇటీవల చిత్రీకరించిందట మూవీ టీం. ఇది జాతర నేపథ్యం లో సాగుతుందట. అదే టైంలో అక్కడ భారీ యాక్షన్ సీన్ కూడా ఉంటుందట. అదే షూటింగ్‌ లో బన్నీ వెన్ను నొప్పితో బాధపడినట్టు సినీవర్గాల నుంచి సమాచారం. మరి దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి కారిటీ వస్తుందో చూడాలి. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బన్నీ తన ఓటు హక్కు వినియోగించుకున్న సంగతి తెలిసిందే. క్యూలో నిలబడి మరి బన్నీ ఓటు వేసిన వీడియో నెట్టింట హల్‌చల్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: