కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరోలలో జయం రవి కూడా ఒకరు.. జయం రవి నటించేటువంటి ఎన్నో చిత్రాలు ఊహించని విధంగా ఉంటాయి. ముఖ్యంగా సరికొత్త కదా అంశంతో ఈ సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. పొన్నియన్ సెల్వన్ వంటి చారిత్రాత్మక కథ చిత్రాలలో కూడా నటించడం జరిగింది. ఈ తరహా కథ పాత్రలలో సత్తా చాటడం జరిగింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తరువాత వచ్చిన సినిమా ఇరైవన్ సినిమా పూర్తిగా డిజాస్టర్ గా మిగిలింది.


ప్రస్తుతం జయం రవి నాలుగైదు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇందులో ఒకటి జీని.. జయం రవి సరసన కృతి శెట్టి, కళ్యాణ్ ప్రియదర్శిని, వామికా కబి హీరోయిన్స్ గా నటిస్తూ ఉండడం జరుగుతోంది. డైరెక్టర్ అర్జున తెరకెక్కిస్తున్న ఈ సినిమా అని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. దాదాపుగా 100 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రాన్ని 18 భాషలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.. పొన్నియన్ సెల్వన్ సినిమాని పక్కన పెడితే జయం రవి నటిస్తున్న మొట్టమొదటి 100 కోట్ల బడ్జెట్ సినిమా ఇదే అని చెప్పవచ్చు.


ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. మరి కృతి శెట్టి ఇందులో హీరోయిన్గా కూడా నటిస్తూ ఉండడంతో ఈ సినిమాతో అయినా ఈమె కెరియర్ మారుతుందా అంటూ అభిమానులు వాపోతున్నారు. సరైన కథల ఎంపిక విషయంలో తగిన నిర్ణయాలు తీసుకోలేక ఎన్నో చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. కోలీవుడ్లో తన అదృష్టాన్ని సైతం పరీక్షించుకోవడానికి ఇలా జయం రవి సినిమాలలో నటించినట్లు తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్లో 18 భాషలలో విడుదల చేయడంతో మరింత క్రేజ్ అందుకొని అవకాశం ఉన్నది. మరి కృతి శెట్టికి ఈ జీని సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: