బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా యానిమల్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్స్ పరంగా ముందుకు దూసుకుపోతోంది.ముఖ్యంగా సందీప్ రెడ్డి మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్, రణబీర్ కపూర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కారణంగా మూవీకి ఒక రేంజ్ లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక మొదటి రోజు కంటే రెండో కలెక్షన్స్ మరింత పెరిగాయి.దీనిని బట్టి ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ ని అందుకుందో అంచనా వేయవచ్చు. ఈ సంవత్సరం బాలీవుడ్ నుంచి వచ్చిన మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా యానిమల్ ఉండబోతోందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక రష్మిక కూడా యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు సొంతం చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి రెండు రోజుల్లో ఏకంగా 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయ్యింది.మొదటి రోజు వంద కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు అందుకున్న ఈ సినిమా రెండో రోజు  అంతకు మించి కలెక్ట్ చేసింది. దీంతో ఓవరాల్ గా మొత్తం గ్రాస్ 250 కోట్లు అందుకుంది. అలాగే ఆదివారం నాడు కూడా వంద కోట్లకి పైగా వసూళ్ళని యానిమల్ నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు.


ఇక నెట్ పరంగా చూసుంటే రెండు రోజుల్లో ఈ సినిమా 129 కోట్లని అందుకుంది. ఈ సినిమాకి 200 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తం 210 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మూవీని 4 వేలకి పైగా థియేటర్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. మొదటి రోజు ఈ సినిమాకి 63.8 కోట్ల నెట్ వసూళ్లు అయ్యింది.ఇక రెండో రోజు ఏకంగా 68 కోట్ల నెట్ అందుకుంది. ఓవరాల్ గా ఇప్పటి దాకా ఈ సినిమాకి 129.80 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 81 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకుంటే సరిపోతుంది. రెండు రోజుల్లో ఈ బ్రేక్ ఈవెన్ ని యానిమల్ మూవీ దాటిపోయే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ ఏడాది వెయ్యి కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన జవాన్, పఠాన్ సినిమాల సరసన యానిమల్ కూడా చేరే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో కూడా 5.8 మిలియన్ డాలర్లు యానిమల్ మూవీ కలెక్ట్ చేసింది.అయితే ఈ సినిమా వల్ల రష్మిక భయంకరంగా ట్రోల్ అవుతుంది. ఈ సినిమాలో బట్టలు విప్పుకొని మరీ హీరోతో రొమాన్స్ చేసిన సన్నివేశాలు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ట్రోలర్స్ కామెంట్స్ తట్టుకోలేక ఆమె సోషల్ మీడియాలోకి రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: