పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్.. ఇక ఆ తర్వాత తన సినిమాలతో వరల్డ్ వైడ్ గా కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమా వస్తుంది అంటే చాలు కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఇక ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇక ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన విడుదలకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రభాస్ గురించి గతంలో రాజమౌళి చెప్పిన ఒక విషయం ముమ్మాటికి నిజమే అంటూ ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. అయితే రాజమౌళి చెప్పింది సినిమాల విషయంలో కాదు.. ప్రభాస్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడు అన్న విషయంపై అప్పట్లో ఆసక్తికర కామెంట్ చేశాడు. ప్రభాస్ కి ఏ పని చేయాలన్నా చాలా బద్ధకం అంటూ జక్కన్న చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి. అయితే ఇక జక్కన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారిపోవడానికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ హీరోలు ఇక ఈ పోలింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతే కాదు ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకోవాలంటూ సూచించారు. అయితే హైదరాబాదులోనే ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం ఓటు వేయడానికి రాలేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే గతంలో రాజమౌళి ప్రభాస్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. సినిమాల విషయంలో తప్ప ఏ పని చేయాలన్న బద్ధకం అంటూ చెప్పాడు. ఇక రాజమౌళి ప్రభాస్ గురించి చెప్పింది నిజమేనని.. ఆ బద్ధకంతోనే ఓటు వేయడానికి కూడా ప్రభాస్ రాలేదు అంటూ కొంతమంది నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: