త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా వచ్చేయేడాదే సంక్రాంతి బరిలో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్డేట్స్ అయితే చిత్ర బృందం తెలియజేయడం జరిగింది..ANR వర్చువల్ స్టూడియోలో ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నట్లుగా మేకర్స్ కొద్ది రోజుల క్రితం తెలియజేయడం జరిగింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ను సైతం చిత్ర బృందం తీసుకురాబోతున్నారు. అదేమిటంటే ఈ చిత్రంలోని రెండవ పాట ఈ వారంలోని విడుదల కాబోతోందని నిర్మాత నాగ వంశీ తెలియజేయడం జరిగింది.


గతంలో కూడా నాగవంశీ మాట్లాడుతూ ఈ సినిమా గురించి అప్డేట్ సైతం విడుదల చేస్తూనే ఉన్నారు. ఇటీవలే విడుదలైన మొదటి పాట ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడం జరిగింది.మరి తాజాగా ఈ రెండవ పాట గురించి అప్డేట్ రావడంతో అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ANR వర్చువల్ స్టూడియోలో ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్టు తెలియజేశారు. అయితే ఈ స్టూడియోలో సినిమాకి కావాల్సిన లొకేషన్స్ అన్నిటిని కూడా బ్యాక్ గ్రౌండ్ లో సెట్ చేసుకొని సదుపాయం ఉంటుందట.


అందుకే ఈ సినిమాని ఇందులో షూటింగ్ చేస్తున్నట్లు అధికారికంగా చిత్రా బృందం ఒక ఫోటోను సైతం షేర్ చేయడం జరిగింది. మహేష్ కు జోడిగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు సంగీతాన్ని థమన్ అందిస్తూ ఉన్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కావడానికి సిద్ధమవుతోంది మరి ఏ రేంజ్ లో ఈ సినిమా కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి. వచ్చే ఏడాది మొదట్లో రాజమౌళితో తదుపరిచిత్రాన్ని చేయబోతున్నారు మహేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: