హీరో బాలకృష్ణ డైరెక్టర్ బాబి కాంబినేషన్లో ఒక సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా వచ్చే యేడాది ఎలక్షన్లు పూర్తి అయిన వెంటనే విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇందులో బాలకృష్ణ ఒక్కరే కానీ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పాత్ర ఒక్కో విధంగా చూపించబోతున్నట్లు డైరెక్టర్ బావి తెలుస్తోంది అయితే ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.కానీ బాలయ్య ఈ సినిమాల తన యాక్టింగ్ స్కిల్స్ తో అభిమానులను మాత్రం మెస్మరైజ్ చేయడం ఖాయమనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని బాలయ్య నటన విశ్వరూపం మరొకసారి ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణకు హీరోయిన్లు కూడా వేరువేరు పేర్లతో ప్రచారంలో వస్తూ ఉన్నాయి.ముఖ్యంగా ఈ సినిమాకి బాలయ్య రెమ్యూనరేషన్ కూడా 30 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. కమర్షియల్ అంశాలతో మాస్ మసాలా సినిమాగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ బావి తెరకెక్కిస్తూ ఉన్నారు. బాలయ్య రేంజ్ కు తగ్గట్టుగా డైరెక్టర్ బాబి ఈ సినిమా కథను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.



బాలయ్య రేంజ్ తో ఈ సినిమాతో పదింతలు రెట్టింపు పెరుగుతుందని కూడా అభిమానులు తెలుపుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటన నటీనటుల విషయాలు కూడా తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నాయి. బాలయ్య అన్ స్టాపబుల్-3 లో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో బాలయ్య వరుసగా విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. బాలయ్య నటిస్తున్న ప్రతి ప్రాజెక్టులను కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఇటీవలే భగవంత్ కేసరి  సినిమాని మొదట తెలుగులో విడుదల చేయగా ఆ తర్వాత తమిళ మలయాళం భాషలలో కూడా విడుదల చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: