యష్ అభిమానులంతా తన నెక్స్ట్ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. తను ఎక్కడ కనిపించినా కూడా ఇదే ప్రశ్న అని అడుగుతూ ఉన్నారట. అందుకు గతంలో ఒకసారి బదిలిస్తూ ఎదురుచూస్తూ ఉండండి అంటూ క్రేజీ అప్డేట్ ను తెలియజేశారు. ఇటీవలే మలయాళ డైరెక్టర్ గీతు మోహన్ దాస్.. యష్ -19 సినిమాని డైరెక్షన్ చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ తాజా తన 19వ సినిమా అప్డేట్ మాత్రం వచ్చేసిందని చెప్పవచ్చు.
యశ్ సోషల్ మీడియాలో అధికారికంగా తన 19వ సినిమా అని ప్రకటించడం జరిగింది. KVN ప్రొడక్షన్ నిర్మాణంలో యష్ తన 19వ చిత్రాన్ని ప్రకటించడం జరిగింది. టైటిల్ని డిసెంబర్ 8వ తేదీన ఉదయం 9:55 నిమిషాలకు సైతం ప్రకటించబోతున్నట్లు తెలియజేశారు. అప్పుడే ఈ సినిమా డైరెక్టర్ని కూడా తెలియజేయబోతున్నట్లు సమాచారం. ఈ ప్రకటన కోసం యష్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి ఎలాంటి సినిమా కథ అంశంతో ప్రేక్షకులను మెప్పింస్తారో చూడాలి మరి. ఈ సినిమా కూడా పాన్ ఇండియాల వల్ల తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం. మరి పూర్తి సమాచారం తెలియాలి అంటే డిసెంబర్ 8వ తేదీ వరకు ఆగాల్సిందే..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి