తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత క్రేజ్ కలిగిన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి నందమూరి నటసింహం బాలకృష్ణ ... టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? ఆ సినిమాల షూటింగ్ స్టేటస్ ఏంటో తెలుసుకుందాం.

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫ్లిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 109 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ చిత్రీకరణను ఈ చిత్ర బృందం "ఎన్ బి కే 109" అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం ఊటీ లో బాలకృష్ణ మరియు ఊర్వశి రౌటేలా పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు.

నాగార్జున ప్రస్తుతం విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందుతున్న నా సామి రంగా అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నాగార్జున కు జోడిగా ఆశిక రంగనాధ్ నటిస్తూ ఉండగా ... అల్లరి నరేష్ , రాజ్ తరుణ్మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం నాగార్జున మరియు అశిక పై ఒక ప్రత్యేక సెట్ లో ఈ మూవీ షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: