కోలీవుడ్లో స్టార్ హీరోలుగా పేరుపొందిన హీరో సూర్య కార్తీ తమ సినిమాలతో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ప్రజలకు మంచి చేస్తూ అభిమానుల మనసును గెలుచుకుంటూ ఉంటున్నారు. కష్టాలలో ఉన్న వారికి చేయి అందిస్తూ ఉంటారు సూర్య కార్తీ.. తాజాగా ఈ ఇద్దరు అన్నదమ్ములు చెన్నైలో వరదల భద్రత కోసం సహాయాన్ని సైతం తెలియజేయడం జరిగింది. చెన్నై నగరాన్ని మిగ్ జామ్ తుఫాను చాలా భయభ్రాంతులకు గురయ్యేలా చేస్తోంది. ఈ వరదల కారణంగా సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం చాలా కష్టాలను ఎదుర్కొంటున్నట్లుగా నిన్నటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.


స్టార్ హీరోలు సైతం సహాయం కోసం ఆర్థిస్తూ పలు రకాల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. ఈ వరదల వల్ల కరెంటు పోవడం కమ్యూనికేషన్ కట్ అవ్వడంతోపాటు చాలామంది ఇళ్లల్లో వరద నీరు కూడా రావడంతో ఆహారం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది ఇక ఇలాంటి సమస్యలు చూసిన సూర్యకాంతి సహాయ చర్యల కోసం దాదాపుగా పది లక్షల రూపాయలు డొనేట్ చేసినట్లుగా తెలుస్తోంది ఇద్దరు అన్నదమ్ములు చేసిన పనికి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.


తమ హీరోలతో పాటు అభిమానుల సంఘాలు కూడా పెద్ద ఎత్తున సహాయం చేస్తూ ఉన్నారు.. మరో నటుడు విశాల్ కూడా తనకు తోచిన విధంగా వరదలలో చిక్కుకున్న వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ వరదలలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూడా చిక్కుకోవడంతో రక్షక సిబ్బంది ఆయనను రక్షించడం జరిగింది.. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సూర్య కార్తీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సూర్య కంగువ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. కార్తీ కూడా ఖైదీ సినిమా సీక్వెల్ లో నటించడమే కాకుండా సర్దార్ సీక్వెల్లో కూడా నటిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: