బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.రీసెంట్ గా రిలీజ్ అయిన 'యానిమల్' మూవీ అదిరిపోయే టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తొలి రోజు ఏకంగా రూ.116 కోట్లు వసూళు చేసి సత్తా చాటింది. రణబీర్ కపూర్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా యానిమల్ మూవీ రికార్డు సాధించింది.ఇక ఈ సినిమాలో రష్మిక నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి.. విమర్శకులు కూడా ఆమె నటకు ఫిదా అయ్యారు. ఎమోషనల్ సన్నివేశాల్లో రష్మిక మందన్న ఎంతో అద్భుతంగా నటించింది..అయితే ‘యానిమల్‘ మూవీ విడుదలకు ముందు రిలీజ్ అయిన ట్రైలర్ లో రణబీర్ తో వాదనకు దిగుతూ రష్మిక పళ్లు కొరుకుతూ చెప్పిన ఓ డైలాగ్ మీద పలువురు విమర్శలు చేసారు.. ఆమె చెప్పిన డైలాగ్ ఏంటో అస్సలు అర్థం కావట్లేని ట్రోల్ చేశారు. సినిమా విడుదల అయ్యాక మాత్రం రష్మిక నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి.. ట్రోల్ చేసిన వారే ఆమె నటన అద్భుతమని ప్రశంసిస్తున్నారు తాజాగా సోషల్ మీడియాలో ‘యానిమల్‘ ట్రైలర్ కు సంబంధించిన స్టిల్ ను నెటిజన్లు షేర్ చేస్తూ రష్మికను అభినందిస్తున్నారు. “ఈ సీన్ చూసి చాలా మంది రష్మికను ట్రోల్ చేశారు. కానీ, సినిమాలో ఆమె నటన ఎంతో న్యాచురల్ గా ఉంది. మొత్తం సినిమాలో ఆమె నటన వావ్ అనిపించింది.ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో  హీరో రణబీర్ ను మించి నటించింది ’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేసారు.. “నవ్వు, కోపం, ఏడుపు, నిరాశ ఇలా కలగలిపిన రష్మిక నటన ఎంతో ఆకట్టుకుంది. అలాగే ఆమె నటన ‘అపరిచితుడు’ మాదిరిగా ఉంది” అని మరో నెటిజన్ ప్రశంసించాడు

మరింత సమాచారం తెలుసుకోండి: