యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న బిగ్ బడ్జెట్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్' కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.బాహుబలి సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు అంతగా మెప్పించకపోవడంతో ఇప్పుడు అభిమానుల ఆశలన్ని ఈ మూవీ పైనే ఉన్నాయి.ఇంకా అంతేకాకుండా కొన్నేళ్ల తర్వాత ప్రభాస్..ఈ మూవీతో ఫుల్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. ఇక కేజీఎఫ్ 1,2 లతో బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ మూవీని చూసేందుకు అడియన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఈ మూవీపై క్యూరియాసిటిని పెంచగా.. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్‏తో ఈ మూవీ ఏ రేంజ్‏లో ఉంటుందో చెప్పేశాడు ప్రశాంత్ నీల్. ఇప్పటి దాకా ప్రభాస్ ఫ్యాన్స్ ఊహించని మాస్ యాక్షన్ కంటెంట్ ఈ మూవీలో ఉండనుందని సమాచారం తెలుస్తోంది. ఈ మూవీ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 22న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.ఇక ఇటు రిలీజ్ టైం దగ్గరపడుతుండడంతో రోజు రోజుకీ ఎగ్జైట్మెంట్ పెరుగుతూ వస్తుంది.


ఇక ఇప్పుడు సలార్ మూవీ సెకండ్ ట్రైలర్ గురించి సోషల్ మీడియాలో మరో క్రేజీ అప్డేట్ బాగా చక్కర్లు కొడుతుంది.అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీ మొదటి ట్రైలర్ లో దేవా వెర్షన్ లో ప్రభాస్ విట్నెస్ చేస్తే.. ఇక ఇప్పుడు రెండో ట్రైలర్ లో సలార్ గా ప్రభాస్ కనిపించే వెర్షన్ చూపించనున్నారని సమాచారం తెలుస్తోంది. దేవా నుంచి సలార్ గా ప్రభాస్ ఎలా మారాడు అన్నది సెకండ్ ట్రైలర్ లో ఉండనుందని సమాచారం వినిపిస్తోంది. దీంతో ఈ మూవీ సెకండ్ ట్రైలర్ ఏ లెవల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్న అప్డేట్ ప్రకారం డిసెంబర్ 16న ఈ మూవీ రెండో ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి దాకా ఎలాంటి క్లారిటీ రాలేదు.కేజీఎఫ్ 1, 2 సినిమాల తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీను నిర్మిస్తుంది. ఇందులో ప్రభాస్ కి జోడిగా శ్రుతి హాసన్ ఆద్య పాత్రలో కనిపించనుంది. ఇంకా అలాగే మలయాళి స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలలో నటించనున్నారు. ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నట్లు గతంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: