తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతాన్ని క్రియేట్ చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది బాహుబలి 2  అనే చెప్పాలి. ఈ సినిమా ఇండియాలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా చరిత్ర లో నిలిచింది.2000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇండియా లో 2000 కోట్లు సాదించిన మొదటి సినిమాగా నిలిచింది.ఇక ఇందులో జక్కన్న రాజమౌళి పాత్ర చాలా ఉంది. కర్త కర్మ క్రియ అన్ని తనే అయి నడిపించి ఈ సినిమాను భారీ హిట్ సాధించే దిశగా ముందుకు తీసుకెళ్లాడు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా రికార్డును బ్రేక్ చేయడానికి కొన్ని సినిమాలు ట్రై చేస్తున్నాయి.అవి ఏంటి అంటే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వస్తున్న సలార్ సినిమాసినిమా రికార్డును బ్రేక్ చేస్తుంది అంటూ చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే నిజానికి బాహుబలి రికార్డును బ్రేక్ చేయాలంటే అంత ఈజీ కాదు.200 కోట్లు రాబట్టాలి అంటే సినిమాకి పాజిటివ్ టాక్ రావాలి, అలాగే సినిమాలో ఎలివేషన్స్ గాని ఎమోషన్ సీన్స్ గాని చాలా బాగుండాలి ఒకటికి రెండుసార్లు ఆడియన్స్ సినిమా థియేటర్స్ కి వచ్చే విధంగా సినిమా ఉంటేనే తప్ప ఆ సినిమాకి కలెక్షన్స్ రావడం అనేది అసాధ్యమనే చెప్పాలి...   ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబో లో వస్తున్న పుష్ప 2 సినిమా కూడా బాహుబలి రికార్డు పై కన్నేసింది. ఏకంగా 2000 కోట్లు కలెక్షన్స్ ని సాధించి భారీ రేంజ్ లో కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలవాలని అటు అల్లు అర్జున్ ఇటు సుకుమార్ భావిస్తున్నట్టు గా తెలుస్తుంది.ఇక పుష్ప సినిమాతో 1200 కోట్ల భారీ కలెక్షన్స్ ని రాబట్టారు. మరి ఈ సినిమాతో 2000 కోట్ల కలెక్షన్స్ ను కొల్ల గొడతారా..? లేదా..? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: