పుష్ప మూవీలో కేశవ పాత్ర చేసిన బండారు జగదీశ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. జూనియర్ ఆర్టిస్ట్ అయిన మహిళ ఆత్మహత్య వెనుక జగదీశ్ హస్తం ఉందని నమ్మిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.నవంబర్ 29న పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె వృత్తిరీత్యా జూనియర్ ఆర్టిస్ట్. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో జగదీశ్ ప్రమేయం ఉందని తెలిసింది. నవంబర్ 27న సదరు మహిళ మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు తీసిన జగదీశ్ బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డాడని సమాచారం. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని మహిళను జగదీష్ బెదిరించాడు. ఆందోళన, మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుంది. కొద్దిరోజులుగా పోలీసులు జగదీష్ కోసం గాలిస్తున్నారు. ఎట్టకేలకు పట్టుబట్టాడు.

అతన్ని కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన టాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది. పుష్ప మూవీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు జగదీశ్. హీరో అల్లు అర్జున్ ఫ్రెండ్ గా ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు. పుష్ప మూవీ జగదీష్ వాయిస్ ఓవర్ తోనే నడుస్తుంది. అంతటి కీలక రోల్ జగదీష్ కి దక్కింది. పుష్ప బ్లాక్ బస్టర్ కావడంతో జగదీష్ మరింత పాపులర్ అయ్యాడు. పుష్ప అనంతరం జగదీష్ కి పరిశ్రమలో ఆఫర్స్ పెరిగాయి. ఓటీటీ లో కూడా పలు ప్రాజెక్ట్స్ చేశాడు. పుష్ప 2లో కూడా జగదీష్ నటిస్తున్నాడు. జగదీష్ అరెస్ట్ తో ప్రాజెక్ట్ అయోమయంలో పడింది. మరి జగదీష్ పాత్రను రీప్లేస్ చేస్తారా? లేక అతన్నే కొనసాగిస్తారా? అనేది చూడాలి. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2లో రష్మిక మందాన హీరోయిన్. దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: