రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన మోస్ట్ వైలెంట్ ఫిలిం 'యానిమల్'   సినిమాలో అడల్ట్ సీన్స్, వైలెన్స్ విపరీతంగా ఉన్నాయని సెన్సార్ ఈ సినిమాకి 'A' సర్టిఫికెట్ ఇచ్చింది. అయినా కూడా ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అయితే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చూసి నోరెళ్ళబెడుతున్నారు. ఇక యానిమల్ మాత్రమే కాదు రాబోయే రోజుల్లో రిలీజ్ కాబోతున్న చాలా సినిమాలు ఇదే దారిలో వెళ్లనున్నట్లు కనిపిస్తున్నాయి. యానిమల్ మూవీలో రక్తపాతం చూస్తే కళ్ళు తిరుగుతాయి. 

సినిమా చూసిన చాలామంది ఈ మూవీలో వైలెన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. చంపడంలోనూ అంత క్రూరత్వం ఏంటి? అన్ని వందల మందిని అంత క్రూరత్వంగా చంపడాన్ని చూపించడం ఎందుకు? అంటూ పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన 'లియో' విషయంలోనూ ఇదే టాపిక్ ట్రెండ్ అయింది. రిలీజ్ అయిన సినిమాలే కాదు రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాల్లోనూ ఇలాంటి యాక్షన్ సీన్స్ మరో రేంజ్ లో ఉండబోతున్నాయి. అందులో ముఖ్యంగా భయమంటే ఏంటో తెలియని మృగాలను భయపెట్టే వాడి కథగా ఎన్టీఆర్ 'దేవర' రెడీ అవుతోంది. 

ఇక కోలీవుడ్ హీరో సూర్య నటిస్తున్న 'కంగువా' లోనూ ఇలాంటి సన్నివేశాలు బోలెడు ఉంటాయని చెబుతున్నారు. సూర్య లుక్ చూస్తేనే శత్రువులు భయంతో పరుగులు తీసేలా అనిపిస్తోంది. ఇక యాక్షన్ లోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక మన పుష్పరాజ్ రంగంలోకి దిగితే ఎవరి కాలేదో, ఎవరి తలేదో తేల్చడం కష్టం. పుష్ప కోపానికి హద్దుండదు.. బన్వర్ సింగ్ చేసే అక్రమాలకు అంతుండదు.. సో వాళ్ళిద్దరి మధ్య ఓ రేంజ్ లో యాక్షన్ సీన్స్ ని క్రియేట్ చేయడంలో క్రియేటివ్ హెడ్ సుకుమార్ ఎప్పుడూ ముందే ఉంటారు. దీన్ని బట్టి చెప్పేదేంటంటే సినిమాలో ఎంత వైలెన్స్ ఉంటే ఆ మూవీ అంత పెద్ద హిట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ ఫాలో అవుతున్న ఫార్ములా కూడా ఇదే. 

మరింత సమాచారం తెలుసుకోండి: