సినీ ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు.. ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత విడాకులు తీసుకోవడం చాలా కామన్ గా మారిపోయింది. ఈటీవీలో కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు విడాకులు కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అన్న తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీలో చాలామంది సినీ సెలబ్రిటీలు తమ వ్యక్తిగత కారణాలవల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల టాలీవుడ్ స్టార్ జంట నాగచైతన్య సమంత కూడా విడాకులు బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే నాగచైతన్య సమంత ఇద్దరూ విడిపోతారు అని

 ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అప్పట్లో చెప్పి ఎంత సంచలనాన్ని సృష్టించాడో మనందరికీ తెలిసిందే. రాజకీయాల్లోనే కాకుండా సినీ ఇండస్ట్రీకి సంబంధించి పులి సందర్భాల్లో ఆయన చాలా విషయాలను బయటపెట్టారు. గతంలో ఆయన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారు అని చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీంతో ఆయన చెప్పే మాటలను అబద్ధాలే అని సోషల్ మీడియాలో చాలామంది ఆయనని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జ్యోతిష్యులు వేణుస్వామి మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. మెగా ఫ్యామిలీలో ఓ

జంట విడిపోతారంటూ ఆయన కామెంట్స్ చేయడం ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి మాట్లాడుతూ ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిలు విడిపోతారని తెలిపారు. జాతక రీత్యా గ్రహాలు సరిగా లేవన్న ఆయన వారు కలిసి ఉండలేరని వ్యాఖ్యానించారు. అంతేకాదు నాగచైతన్యసమంత తరహాలోనే వరుణ్ – లావణ్య విడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. దీంతో వేణు స్వామి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మేగా అభిమానులు. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే అంటూ దారుణంగా ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: