టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్లలో విజయశాంతి గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను తన నటన తో మెప్పించిన విజయశాంతి రాములమ్మగా కూడా మంచి క్రేజీ అందుకుంది. అయితే రాజకీయాల కారణం చేత సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ వైపుగా పెద్దగా ఎంట్రీ ఇచ్చిన ఎక్కడా కనిపించలేదు ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి బాగానే క్రేజ్ సంపాదించింది. గతంలో టిఆర్ఎస్ బిజెపి పార్టీలో ఉన్న పెద్దగా కలిసి రాలేదు. ఇటీవల కాలంలో వెండితెర పైన పెద్దగా కనిపించలేదు.


ఇప్పుడు తాజాగా ఒక ట్విట్ ను సైతం షేర్ చేయడం జరిగింది విజయశాంతి తన ట్విట్టర్లో రాస్తూ తనను తమ ప్రాణంగా భావిస్తున్న అభిమానులకు ప్రేక్షకులకు జన్మంతం ఎన్నడు తన వెంట ఉన్న అభిమానులకు దైవంగా భావిస్తానని వీరి కృతజ్ఞత కోసం ఏమైనా చేస్తానని నిజం చెప్పాలి అంటే మీ అభిమానం కోసం నేను మళ్ళీ సినిమాను చేస్తున్నాను కావచ్చు అంటూ తెలియజేసింది.. ఐదు దశాబ్దాల నుండి తన సినీ ప్రయాణంలో మీ దీవెనలు ఎప్పటికీ నాతోనే ఉన్నాయి 1979 నుంచి నేటి వరకు మీ విజయశాంతి కళాకారునిగా ఉన్నందుకు ఎప్పటికీ అట్లాగే ఉంటానంటూ కూడా విశ్వసిస్తున్నానంటూ రాసుకొచ్చింది.


ఈ సందర్భంగా నందమూరి కళ్యాణ్ రామ్ డైరెక్టర్ ప్రదీప్ అభినందనలు ట్విట్టర్లో పోస్టులు షేర్ చేయడం జరిగింది. విజయశాంతి అభిమానులు కూడా ఈమెను వెండితెర పైన చూడడానికి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా 2020 లో డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా లో కనిపించింది విజయశాంతి ఇందులో మహేష్ బాబు రష్మిక నటించడం జరిగింది. ప్రస్తుతం విజయశాంతి షేర్ చేసిన ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతున్నది. మరి రాబోయే రోజుల్లో విజయశాంతి మరిన్ని సినిమాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: