తన సినిమాలతో ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తున్న డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగా కూడా ఒకరు. సినిమాలను ఇదే ధోరణిలో తీయాలి అనే ట్రెండ్ కి స్వస్తి పలికి సరికొత్త పోకడకి కారణమయ్యాడు సందీప్ రెడ్డి వంగ. ఏకంగా అర్జున్ రెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్స్ సృష్టించాడు అన్న విషయం తెలిసిందే. ఈ మూవీతో సందీప్ రెడ్డి వంగ ఎలా అయితే ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడో.. అటు హీరోగా నటించిన విజయ్ దేవరకొండ సైతం మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి.


 ఇక ఇదే సినిమాని కథలో కాస్తయినా మార్పులు చేర్పులు చేయకుండా హిందీలో తీసి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు సందీప్. అయితే ఇక అందరూ హీరో లాగా సినిమాలు తీయడంలో పోటీ పడకుండా.. తనకు నచ్చిన కథలను నచ్చిన విధంగానే తీస్తూ ఇక ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక ఇటీవల బాలీవుడ్ హీరో రణబీర్ ప్రధాన పాత్రలో నటించిన యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అయితే సందీప్ ఆ తర్వాత తన సినిమాని ప్రభాస్ తో తీయబోతున్నాడు ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.


 అయితే యానిమల్ సినిమా చూసిన తర్వాత ఇక ప్రభాస్ తో చేసే సినిమాపై అభిమానుల్లో ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగకు డార్లింగ్ ఫ్యాన్స్ అందరు కూడా ఒక విషయంలో స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. యానిమల్ సినిమా కంటే స్పిరిట్ మూవీని మరింత ఇంటెన్సుగా మార్చాలి అని ఏకంగా ఏ రేటింగ్ కోసం ప్రయత్నించాలి అంటూ ప్రభాస్ అభిమానులు దర్శకుని కోరుతున్నారు. అయితే యానిమల్ సినిమాతో పోల్చి చూస్తే ప్రభాస్ స్పిరిట్ సినిమా 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది అంటూ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగ.

మరింత సమాచారం తెలుసుకోండి: